వెంకటాపురం ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ లో అద్దెలు చెల్లించని షాపులు కూల్చివేత
– పోలీసు బందోబస్తు మధ్య జెసిబిలతో కూల్చివేత
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం టీజీ ఆర్టీసీ బస్సు షాపింగ్ కాంప్లెక్స్ లో గత పది నెలలుగా అద్దెలు చెల్లించకుండా షాపులు నిర్వహిస్తూ ఆర్టీసీకి లక్షల రూపాయలు నష్టం కలిగిస్తున్న 10 కి పైగా షాపులను ఆర్టీసీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య శనివారం జెసిబితో కూల్చి వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి… వెంకటాపురం ఆర్టీసీ బస్ స్టేషన్ స్దలం సుమారు రెండు ఎకరాల 30 సెంట్లు దేవాదాయ శాఖ నుండి రెండున్నర దశాబ్దాల క్రితం ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణం నిమిత్తం ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసింది. ఈ స్థలం ఆర్టిసిది కాదని, న్యాయస్థానంలో కేసు వేశారు. కోర్టు లో కేసు పేరు చెప్పి మధ్యలో అద్దెలు మాకే కట్టండి అంటూ డబ్బులు వసూల్లు చేశారని వ్యాపారులు అధికారులుకు తెలిపారు. ఒకపక్క ఆర్టీసీ, మరోపక్క మరొకరు అద్దెల కోసం వేధింపులు చేరని మొర పెట్టు కున్నారు. అయితే కోర్టు తీర్పు ఆర్టీసీకి అనుకూలంగా రావడం తో, అద్దెలు చెల్లించని సుమారు పదికి పైగా షాపుల వారి దుకాణాలను శనివారం ఆర్టీసీ అధికారులు జేసిబితో తొలగిం చారు. సుమారు 10 లక్షల రూ. బకాయిలు పేరుకు పోయాయ ని ఆర్టీసీ అధికారులు మీడియాకు తెలిపారు. అయితే ఏజెన్సీ గిరిజన సంక్షేమ చట్టాల ప్రకారం ఆర్టిసి షాపింగ్ కాంప్లెక్స్లు గిరిజనులకే టెండర్లు ఇవ్వాలనే నిబంధనలు అమలులో ఉండగా, ఈ మేరకు ఆర్టీసీ అధికారులు భద్రాచలం డిపో, ఖమ్మం రీజినల్ మేనేజర్ ఆధ్వర్యంలో టెండర్ నోటిఫికేషన్ ద్వారా వేలం పాటలు నిర్వహించారు. 21 షాపులకు గాను 10 షాపుల వారు గత పది నెలలుగా ఆర్టీసీకి అద్దేలు చెల్లించక పోవడంతో పాటు, షాపులు ఆర్టీసీవి కావని సుమారు పదకొండు లక్షల రూపాయలు పైగా షాపులు అద్దెలు బకాయిలు పేరుకుపోయాయి. పలుమార్లు ఆర్థిసి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన అద్దెలు చెల్లించకపోవడంతో, ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాలపై ఖమ్మం ఆర్టీసీ రీజనల్ మేనేజర్, భద్రాచల ఆర్టీసీ డిపో మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్, ఆర్టీసీ సెక్యూరిటీ పోలీసు విభాగం సుమారు 70 మంది సిబ్బంది వెంకటాపురం చేరుకొని షాపుల కూల్చివేత పనులను రాత్రి పొద్దుపోయే వరకు చేపట్టారు. మరి కొంతమంది వ్యాపారులు తమ సామానులు షాపుల నుండి తీసివేస్తామని తెలపగా రెండుగంటల సమయం ఇచ్చారు. షాపులను నుండి సామాన్లు తీసుకువెళ్లిపోగా, ఆర్టీసీ అధికారులు జెసిబి ద్వారా షాపులను కూల్చివేశారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావుకు సమస్యను అధికార పార్టీ నేతలు వివరించారు. పేరుకుపోయిన బకాయిలు చెల్లించడం లేదని, ఉన్నతాధికారి ఆదేశంపై ఆయా షాపులను తొలగించి తిరిగి ఆర్టీసీ నియమ నిభందనల ప్రకారం టెండర్ నోటిఫికేషను ద్వారా మిగిలిన షాపు లను కేేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ పవిత్ర, భద్రాచలం డిపో మేనేజర్ తిరుపతి, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ఆర్. రోహిజీ, సి.ఐ. గౌతమి, ఎస్.ఎం. వెంకన్న, ఖమ్మం ఆర్.ఎం.పరిదిఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటాపురం సివిల్ పోలీస్ ఎస్ఐ తిరుపతిరావు పోలీస్ సిబ్బంది ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందితో సంయుక్తంగా బందోబస్తు నిర్వహించారు.