రైతు వేదికల్లో రుణమాఫీ సంబరాలు
వెంకటాపురం నూగూరు,తెలంగాణా జ్యోతి : రైతులకు లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీని గురువారం నుండి అమలు పరచనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై రైతు వేదికలలో రైతు రుణమాఫీ సంబరాలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం రైతులు రుణమాఫీ సంబరాలు జరుపుకునేందుకు తరలి రావాలని మండల వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం, మరికాల రైతు వేదిక లలో ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు నిర్వహించారు. రైతులు గురువారం సాయంత్రం మూడు గంటల్లోగా రైతు వేదికల వద్దకు తరలివచ్చి సంబరాల్లో పాల్గొనాలని వ్యవసాయ శాఖ పిలుపునిచ్చింది.