రైతు వేదికలో రుణ మాఫీ సంబరాలు

Written by telangana jyothi

Published on:

రైతు వేదికలో రుణ మాఫీ సంబరాలు

కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : గురువారం నుండి లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ ప్రారంభం నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సంబరాలు నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి రామ కృష్ణ తెలిపారు. రేపు అనగా గురువారం మధ్యాహ్నం 4 గంటలకు రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేరుగా రుణమాఫీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారని వివరించారు. అలాగే లబ్ధిదారులతో ముఖాముఖి గా మాట్లాడుతారని పేర్కొన్నారు. రైతు వేదిక వద్ద రైతులు ఈ కార్యక్రమాన్ని తిలకించవచ్చని, వీడియో కాన్ఫరెన్స్ (దృశ్య శ్రవణ మాధ్యమం) ద్వారా రుణ మాఫీ రైతులు మాట్లాడటానికి అవకాశం ఉందని వివరించారు. రుణమాఫీ డబ్బులు విడుదలైన రోజునే రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, బ్యాంకు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు సంబరాల్లో పాల్గొంటారని అన్నారు. రైతులు తప్పనిసరిగా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరుకావాలని వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ కోరారు.

Leave a comment