శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో సిపి ప్రత్యేక పూజలు.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వారికీ దేవస్థానం అర్చకులు,వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి శేష వస్త్రములతో వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదములు అందజేశారు.ఈ కార్యక్రమంలో మహదేవపూర్ సీఐ రాజేశ్వర్ రావు, కాళేశ్వ రం ఎస్సై భవానీ సేన్ పాల్గొన్నారు.