రాత్రి వేళల్లో రోడ్లపై ఉండే ఆవులను గోశాలకు తరలించాలి
– సెన్సార్ బోర్డ్ సభ్యుడు దుర్గం తిరుపతి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా, కాటారం మండల కేంద్రమైన గారెపల్లి వ్యాపార కూడలి, నేషనల్ హైవే రోడ్డుపై రాత్రి వేళలో నిద్రిస్తున్న ఆవులను గోశాలకు తరలించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి, సెన్సార్ బోర్డు మెంబర్ దుర్గం తిరుపతి పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన ఆవులు ఉదయం నుంచి సాయంత్రం సమ యంతో పాటు రాత్రి వేళల్లో సైతం రోడ్లపై తిరుగుతూ, నిలిచి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆందో ళన వ్యక్తం చేశారు. ఆ ప్రమాదాలలో ఆవులు చనిపోవడం జరుగుతుందని అన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి, మండల పంచాయతీ అధికారి పట్టించు కోవడంలేదని ఆరోపించారు. రోడ్లపై తిరుగుతున్న ఆవుల వల్ల ఆర్టీసీ బస్సులకు, బొగ్గు, ఇసుక టిప్పర్లకు, ద్విచక్ర వాహ నదారులకు సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపో యారు. ఆవులను పెంచుకుంటున్న రైతులు పట్టించు కోవడంలేదని, రోడ్లపై తిరుగుతున్న ఆవులను వేములవాడ, కాలేశ్వరం గోశాలకు తరలించాలని దుర్గం తిరుపతి కోరారు.