అశోక్ నగర్ పెట్రోల్ బంక్ లో కల్తీ అమ్మకాలు.
ఖానాపూర్, తెలంగాణ జ్యోతి : రోజురోజుకు డీజీల్, పెట్రోల్ ధరలు పెరిగి మండిపోతున్న తరుణంలో కల్తీ అమ్మకాలతో వాహనదారులను పెట్రోల్ బంక్ యాజమానులు ఇబ్బందు లకు గురి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే… వరి కోత యంత్రం లో అశోక్ నగర్ పెట్రోల్ బంక్ లో 50 లీటర్ల డీజిల్ పోయించు కోగా మొత్తం కల్తీ వచ్చినట్టు బాధితుడు వాపోయాడు. గతం లో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుందని, బంక్ యజమానులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతు న్నాడు. డీజిల్ ధరలు అధికంగా పెరగి భారంగా మారిందని, దానికి తోడు కల్తీ పెట్రోల్, డీజిల్ ను వాహనాలలో పోయించు కొని తిరుగుతున్న క్రమంలో మైలేజీ రాక వాహనాలు సైతం మరమ్మత్తులకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు బంకు ను తనిఖీ చేసి యజమానిపై చర్యలు తీసుకోవాలని పలువురు వాహన దారులు డిమాండ్ చేస్తున్నారు.