ఆర్టీసీ బస్ స్టేషన్ షాపు నిర్వాహకులకు కౌన్సిలింగ్
– అద్ధె బకాయిలు చెల్లించాలి : భద్రాచలం ఆర్టీసీ డి.ఎం తిరుపతి హెచ్చరిక.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని అద్దె ప్రాతిపదికన వ్యాపా రాలు కొనసాగించడానికి ఆర్టీసీ అధికారులు టెండర్లు నిర్వహించారు. ఆయా వ్యాపారాల స్థాయిని బట్టి టెండర్లు దక్కించుకున్న 23 దుకాణాల నిర్వహణ కొరకు ఖాళీ స్థలాన్ని కొన్ని నెలలుగా ఆర్టీసీకి అద్దె చెల్లించకపోవడంతో షాపుల వారికి భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ తిరుపతి గురువారం సాయంత్రం స్థానిక బస్టాండ్ ఆవరణలో షాపుల వారికి అద్దె బకాయిలు పేమెంట్ పై జాప్యం చేయరాదని, అద్దె బకాయిలు చెల్లించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డి.ఎం. హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా ఈ స్థలం నాదే అంటూ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యక్తులు దుకాణాల నిర్వాహకులకు బెదిరింపులతో హుకుం జారీ చేశారు. కొంత మంది షాప్ నిర్వాహకులు ఆర్టీసీ వారికి అద్దె చెల్లించకుండా ప్రైవేటు వ్యక్తులకు చెల్లించారు. దీంతో ఆర్టీసీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహిం చిన పోలీస్ శాఖ కు ఆసక్తికర విషయాలు తెలుగులోకి వచ్చాయి. మండల కేంద్రం కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ స్థలం మాది అని ఆర్టిసి వారికి అద్దె చెల్లించకుండా తమకే చెల్లించాలని బెదిరించగా షాపుల వారు ఆ వ్యక్తికే అద్దె చెల్లి స్తున్నారని విచారణలో వెళ్లడైంది. దాంతో అక్రమంగా రెంట్ వసూలు చేస్తున్న ఇద్దరిపై పోలీసులు భారత్ న్యాయ్ సురక్షా సెక్షన్.308{5} తో, ఎక్స్ ప్రెస్ ఎఫ్.ఐ.ఆర్ తో కేసు నమోదు చేశారు. పోలీసుల అభియోగ పత్రంలో ఆర్టీసీ వారికి చెల్లిం చవలసిన అద్దెలు బెదిరించి ఇరువురు వ్యక్తులు 2 లక్ష ల 43 వేల రూపాయలు వసూలు చేసినట్లు షాపులు వారు పోలీస్ స్టేషన్లో ఆధారాలతో విచారణలో తెలిపారు. ఈ మేరకు ఒక వ్యక్తి ని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీ లో ఉన్నట్లు వెంకటాపురం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కే. తిరుపతిరావు మీడియాకు తెలిపారు. వెంకటాపురం ఆర్టీసీ బస్ స్టేషన్ వ్యవహారం పోలీస్ కేసులతో పాటు, ఆర్టీసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్, భద్రాచలం డిపో మేనేజర్ వెంకటాపురం బస్ స్టేషన్ వ్యవహారంపై పూర్తిస్థాయి దృష్టి చారించినట్లు వినికిడి. వెంకటాపురం ఆర్టీసీ బస్ స్టేషన్ వ్యవహారం, వెంకటాపురం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.