తిప్పాపురం, కలిపాక గ్రామాల్లో కార్డెన్ సర్చ్
– అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొత్త వారికి ఆశ్రయం కల్పించవద్దని ములుగు జిల్లా వెంకటాపురంసివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కె. తిరుపతిరావు గిరిజనులు ను కోరారు. గురువారం వెంకటాపురం మండల పరిధిలోని తిప్పాపురం పంచాయతీ పెంకవాగు మారుమూల అటవీ గ్రామాల్లో కా ర్ట్ న్ అండ్ చర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఆదివాసులకు వివిధ భద్రతాపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక శక్తులు కల్లబొల్లి మాటలతో వలలో పడేస్తారని, వారికి దూరంగా ఉండి ప్రభుత్వం అమలు పరుస్తున్న గిరిజన సంక్షేమ పథకాలు తో లబ్ధి పొంది, ముందుకు సాగాలని కోరారు. అలాగే ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాల సంఖ్య రోజు,రోజు కు పెరిగిపోతు న్నదని, సైబర్ నేరాలపై అవగాహనతో ముందుకు సాగాలని, సైబర్ నేరగాళ్ళ వలలో పడవద్దని కోరారు. గ్రామీణ యువత, విద్య, ఉద్యోగ ఉపాధి రంగాలలో ముందుకు సాగాలని కోరారు. తల్లి దండ్రులు బడి వయసు పిల్లలని పాఠశాలలకు పంపించాలని విథ్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. గ్రామస్తులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించ డంలో పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని ఎస్.ఐ.తి రుపతిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో ఎస్సై రవికు మార్, సిఆర్పిఎఫ్ సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులు తదితరు లు పాల్గొన్నారు.