సమన్వయమే ఆయన ఆయుధం.
సమన్వయమే ఆయన ఆయుధం.
– విధి నిర్వహణలో వివాదరహితుడు
– గంజాయి మద్యం పిడిఎస్ బియ్యం సరఫరా ,పేకాటరాయుళ్లపై ఉక్కు పాదం.
– నిత్యం బార్డర్ చెక్పోస్టులపై ముమ్మర తనిఖీలు.
– కాళేశ్వరం ఎస్సై భవాని సేన
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : వివాద రహితుడు, అందరి తో కలిసిమెలిసి ఉంటాడు. శాంతి భద్రతలపట్ల కఠినంగా వ్యవహరిస్తాడు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటారు. చట్టానికి లోబడి విధులు నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెరిగేలా ప్రజలకు సేవలు అందిస్తు న్నారు. తమ శాఖలోని అన్ని విభాగాల సిబ్బందిని సమన్వ యంతో ముందుకు నడిపిస్తారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పోలీసుల గౌరవాన్ని పెంపొం దించుకునే విధంగా పనిచేయాలని సూచిస్తారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని తమ సిబ్బందికి ఆదేశిస్తారు. ఎవరు తప్పు చేసినా క్షమించవద్దని, నేరస్తులకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని అంటారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు బార్డర్ పై అలాగే ఆదిలాబాద్ జిల్లా భూపాలపల్లి సరిహద్దు ప్రాంతంమైన అన్నారం బ్యారేజ్ పై నిత్యం ముమ్మర తనిఖీలు చేస్తూ, ముఖ్యంగా గంజాయి, మద్యం, పిడిఎస్ బియ్యం, సరఫరా పై మరియు పేకాటరాయుళ్లపై ఉక్కు పాదం మోపుతున్నారు. యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా రాత్రి వేళలో కుబింగ్ నిర్వహిస్తూనారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల కోసం కరెంటు వైర్లు ఉచ్చులు బిగించే వారికి హెచ్చరికలు జారీచేస్తూ, అలాగే ఫారెస్ట్ అధికారులు మరియు ఎలక్ట్రికల్ సిబ్బందితో కలసి గ్రామాలలో మీటింగులు ఏర్పాటు చేస్తూ ప్రజలకు కేసులో పట్ల అవగాహన కల్పిస్తూ ఎవరైనా పెడచెవిన పెడితే పిడి యాక్ట్ కేసులు నమోదయి తాయని హెచ్చరిస్తున్నారు.ఆయనే కాళేశ్వరం ఎస్సై భవాని సేన, తాజాగా పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడంపై దృష్టి పెట్టారు. పోలీస్ శాఖ నుంచి ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా సేవలందిస్తున్నారు.