Container | రాష్ట్రంలో మొదటి కంటెయినర్ పాఠశాల సిద్ధం
Container | రాష్ట్రంలో మొదటి కంటెయినర్ పాఠశాల సిద్ధం
– ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో కంటెయినర్ ఆసుపత్రి
ములుగుప్రతినిధి: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండ లంలోని బంగారుపల్లి గొత్తికోయగుంపు అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీశాఖ అను మతించలేదు. ఈ తండాలోని పిల్లలు సౌకర్యవంతంగా లేని ఓ గుడిసెలో విద్యా భ్యాసం కొనసాగిస్తున్నారు. ఓ ఉపాధ్యా యిని, ప్రధానోపాధ్యాయుడు ఉన్నారు. కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వకపోవడం తో కలెక్టర్ దివాకర వినూత్నంగా ఆలోచించి కంటెయినర్(ప్రీ ఫ్యాబ్రికే టెడ్) పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ నిధుల నుండి రూ.13 లక్ష లతో చేపట్టిన ఈ పనులు పూర్తి కావొచ్చాయి. వచ్చే వారంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కంటెయినర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో 12 వరకు డ్యూయల్ డెస్కులతోపాటు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోవడానికి 3 కుర్చీలు పట్టే స్థలం ఉంటుంది. రాష్ట్రంలో కంటెయినర్ దుకాణాలు, ఇళ్లు నిర్మిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దడం ఇదే తొలిసారి.