మర్రిగూడెంలో ఇంటర్నల్ సిమెంట్ రోడ్డు నిర్మాణం
– రూ. కోటి నిధులు మంజూరు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మేజర్ పంచాయతీ, ఎంపీడీవో ఆఫీస్ వద్ద నుండి ఎస్సీ మర్రిగూడెంలో ఇంటర్నల్ సిమెంట్ రోడ్డు నిర్మాణం కొరకు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరు నాగారం ఆధ్వర్యంలో కోటి రూపాయలు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ గురువారం నుండి శ్రీకారం చుట్టారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఎస్సీ మరి గూడెం లో బీ.టీ. రోడ్డు నిర్మించారు. మరమ్మతులు లేకపోవడంతో గోతు లుగా ఏర్పడి ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.ఈమేరకు రోడ్ను జేసిబి తో చదు ను చేసే పనులకు శ్రీకారం చుట్టారు. 3.75 మీటర్ల వెడల్పు తో పన్నేండున్నర అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మా ణం కొరకు పనులు ప్రారంభించారు. గత ఎన్నో సంవత్సరా లుగా దళితవాడలో ఇంటర్నల్ రోడ్లు మరమ్మత్తులు చేయా లని, సిమెంటు రోడ్లు మంజూరు చేయాలని, ఆ గ్రామ ప్రజలు విన్నపాలు చేయగా, ప్రభుత్వం ఐటిడిఏ ద్వా రా నిధులు మంజూరు చేసింది. సిమెంట్ రోడ్ నిర్మాణ పను లను నాణ్యతాపరంగా, వేగవంతంగా పూర్తిచేసినందుకు ఐటి డిఏ ఇంజనీరింగ్ అధికారులు ఎస్టమేషన్లతో సాంకేతిక పరమైన మంజూరుతో ఐటిడిఎ ఇంజనీరింగ్ అధికారులు పనులు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు.