నాణ్యత లోపంతో ఏటూర్ సిసి రోడ్ నిర్మాణం

నాణ్యత లోపంతో ఏటూర్ సిసి రోడ్ నిర్మాణం

నాణ్యత లోపంతో ఏటూర్ సిసి రోడ్ నిర్మాణం..!

-అధికారుల పర్యవేక్షణ కరువు

కాసుల కక్కుర్తితో ఇష్టారాజ్యంగా నిర్మించిన సిసి రోడ్…

తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండలం లోని ఏటూర్ గ్రామంలో సిసి రోడ్ నాణ్యత లోపంతో నిర్మిస్తున్నారు. పదికాలాల పాటు ఉండేలా నాణ్యతతో నిర్మించాలని అధికారులు చెపుతుంటే మరోవైపు కాంట్రాక్టర్ కాసులకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా సిసి రోడ్డును నిర్మించారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇష్టారాజ్యంగా సిసి రోడ్డు ను వేశారని ఏటూర్ ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇష్టానుసారంగా నిర్మాణాలు

పనులు పొందిన గుత్తే దారులు నాణ్యత ప్రమాణాలు పాటించ కుండా ఇష్టానుసారంగా సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టినట్లు తెలుస్తోంది. నాణ్యతతో తనకు పని లేదు.. రోడ్డు వేశమా.. కమిషన్ ఇచ్చామా.. బిల్లు పొందమా… అన్నట్లు కొందరు గుత్తేదారుల వ్యవహార శైలి వుంది. నిర్మాణంలో నాసికరకమైన ఇసుక వాడటంతో పాటు… ఇసుక శాతం కంటే కంకర పొడి (డస్ట్)ఎక్కువగా వాడటం, తక్కువ గ్రేడ్ సిమెంట్ వినియోగి స్తూ.. ఒక లోడ్ కి సుమారు10 కట్టలు సిమెంట్ ఉపయోగానికి 5 లేదా 6 బస్తాలను వినియోగిస్తూ నాణ్యతను విస్మరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారుడు నిర్మాణాలు చేపట్టినట్లు ప్రజలు విమర్శిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment