కాంగ్రెస్ పార్టీ మహిళా నేత మృతి

Written by telangana jyothi

Published on:

కాంగ్రెస్ పార్టీ మహిళా నేత మృతి

–  ప్రచార పర్వంలో విషాదం 

– కారు ప్రమాదంలో మరో నాయకుడికి తీవ్ర గాయాలు

– విచారం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి :  పార్లమెంట్ ఎన్నిక ల నేపథ్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల కారు ప్రమాదానికి గురైంది. గురువారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం నుంచి యామన్ పల్లి మీదుగా నిమ్మగూడెంకు వెళుతున్న క్రమంలో అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. కొద్ది దూరం వరకు పల్టీలు కొడుతూ కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మహాముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, సీనియర్ నాయకురాలు కీర్తి భాయ్ ప్రమాదంలో మృతి చెందింది. కాగా ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న మరో కాంగ్రెస్ పార్టీ నేత జాడి రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

– విచారం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించడానికి వెళ్తూ ప్రమాదానికి గురై మృత్యువాత పడిన మహా ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, సీనియర్ నాయకురాలు కీర్తి భాయ్ మృతి పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి , మంథని శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు విచార వ్యక్తం చేశారు. కారు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన మరో సీనియర్ కాంగ్రెస్ నేత, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జాడి రాజయ్యకు మెరుగైన శాస్త్ర చికిత్సలు అందించాలని వైద్యాధికారులకు ఆదేశించారు. అలాగే కీర్తిబాయి మృతి పట్ల శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీనుబాబు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జాడి రాజయ్య త్వరగా కోలుకునే విధంగా వైద్య చికిత్సలు అందిస్తామని అన్నారు. ఈ సంఘటన పట్ల మహ ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగమల్ల దుర్గయ్య, జడ్పీటీసీ సభ్యురాలు లింగమల్ల శారద లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Leave a comment