Congress Vijayaberi | బిజెపి చేతిలో బిఆర్ఎస్ రిమోట్

Written by telangana jyothi

Published on:

Congress Vijayaberi | బిజెపి చేతిలో బిఆర్ఎస్ రిమోట్

• దొరల తెలంగాణ, ప్రజా తెలంగాణ మధ్యే యుద్ధం

• ఒక్క కుటుంబం చేతిలోనే బందీ

• కాంగ్రెస్ గెలిస్తే సకల జనుల కోసం పని చేస్తాం

• ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి

• పెళ్లి చేసుకుంటే రూ.లక్ష నగదు,తులం బంగారం

• అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ

ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా నుంచి పూరించిన ఎన్నికల శంఖారావం “దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికల యుద్ధం జరుగబోతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇస్తే అది ఇప్పుడు ఓ కుటుంబ చేతిలో బందీ అయ్యింది. ఇక్కడ ఓ పార్టీ, కేంద్రంలో మరో పార్టీ కలిసి తమ వ్యవహారాలను ఇచ్చిపు చ్చుకునే ధోరణిలో చక్కబెట్టుకుంటాయి. ఎంతైనా బీఆర్ఎస్, బీజేపీ రెండు మంచి దోస్తానీ చేస్తున్నాయి..” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల శంఖా రావం బుధవారం ములుగు జిల్లాలో ప్రారంభమైంది. కార్య క్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ముందుగా రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనం తరం మూడు రోజుల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ములుగు జిల్లాలోని రామానుజపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే, రాష్ట్రాన్ని సాధించుకున్నట్టు చెప్పుకుంటున్న పార్టీ ఇష్టారీతిగా వ్యవ హరిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే కుటుంబ ప్రయోజనాలకే ఎక్కువయ్యాయని చమత్క రించారు. కేంద్రంలో మోదీ సర్కార్ కాంగ్రెస్ తీసుకొచ్చిన కంపెనీలను అమ్ముకుని ఎంజాయ్ చేస్తోందన్నారు. ఆ రెండు పార్టీలు కలిసిపోయాయని, కేసీఆర్ రిమోట్ మోదీ చేతిలో నిక్షిప్తంగా భద్రపర్చబడి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు.

ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి : ప్రియాంక గాంధీ 

రామాంజపురంలో కాంగ్రెస్ సభలో ప్రియాంకగాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. “BRS పాలనలో ప్రజలు ఆనందంగా లేరు. తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం దక్కలేదు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి. తెలంగాణ ఒక పుణ్యభూమి. తెలంగాణ కోసం ఎంతోమంది జీవితాలు త్యాగం చేశారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చాం. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణ ఇచ్చాం. కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇస్తుంది.” అని ప్రియాంకగాంధీ అన్నారు.

బిజెపి చేతిలో బిఆర్ఎస్ రిమోట్

“తొమ్మిదేళ్ల తెలంగాణలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆధిపత్యమే కనిపిస్తుంది. రాష్ట్రాన్ని రక్షించేందుకు సోనియా గాంధీ కుటుంబం మన ముందుకు వచ్చింది. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది… కానీ ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు. అందుకే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇచ్చారు. పేద ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తాం. ములుగులో సీతక్కను, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావును గెలిపించాలి.” అని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

బిజెపి చేతిలో బిఆర్ఎస్ రిమోట్

కాంగ్రెస్ సభలో సీతక్క మాట్లాడుతూ ములుగులో అనేక కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. వాళ్లు ఎన్ని చేసినా ప్రజలే నాదేవుళ్లు. నియోజకవర్గం విడిచి నేను ఎక్కడికీ వెళ్లను.” అని సీతక్క అన్నారు. రామాంజపురంలో కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now