ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రారంభించారు.ఈ సంద ర్భంగా మండల అధ్యక్షుడు అప్సర్ పాషా, ఇంచార్జ్ జాడి రాంబాబు మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపో వద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలనే విక్రయించి మద్దతు ధరను పొందాలని అన్నారు. కొనుగోలు కేంద్రం ఇంచార్జి పి, వెంకటేష్ ను రైతులకు సహకరించి సకకాలంలో ధాన్యాన్ని మిల్లులకు తరలించి రైతులకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా,అవసరమైన పత్రాలు తీసుకొని రైతులు విక్రయిం చిన సొమ్మును వారి ఖాతాలో త్వరలో జమ చేసేలా చూడాల ని, రైతులు కేంద్రం ఇంచార్జ్ కి సహకరించాలని కూడా అభ్య ర్ధించారు. అంతేకాకుండా ఇటీవలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన చిన్నవరి పంటకు రూ.500 బోనస్ కూడా రైతుల ఖాతాలో వేస్తారని,పూర్తి వివరాలు కోసం సెంటర్ ఇంచార్జ్ ని సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రతినిధులు, అన్ని సంఘాల అధ్యక్షులు గ్రామ మండల జిల్లా కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.