ఎన్కౌంటర్ లో మరణించిన రవి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: ఇటీవల కర్రేగుట్ట ప్రాంతంలో జరిగిన ఆపరేషన్ కగార్ ఎన్కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు సాధనపల్లి రవి అలియాస్ చంద్ కుటుంబాన్ని ఆదివారం కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. మంత్రి సీతక్క ఆదేశాలు, డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు రవి స్వగ్రామమైన ఏటూరు గ్రామానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు పెద్దకర్మ సందర్భంగా రవి కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వారి కుటుంబంతో ఫోన్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పి, వారి సంక్షేమానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అప్సర్ పాషా, మండల ఇంచార్జి జాడి రాంబాబు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు గడ్డం నాగేష్, నాయకులు చిదరీ సుమన్, పల్ల లచ్చబాబు, మాచర్ల బాబు, గాయం రాజబాబు, డేగల బాణయ్య, యూత్ నాయకులు శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు
.