శ్రీధర్ బాబును సన్మానించిన కాంగ్రెస్ నేతలు
శ్రీధర్ బాబును సన్మానించిన కాంగ్రెస్ నేతలు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నేషనల్ కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి ఆరెళ్ళి కిరణ్ గౌడ్ సోమవారం కరీంనగర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు ను నియమించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రధాన కార్యదర్శి మతీన్ ఖాన్ శ్రీధర్ బాబును కలిసి శాలువాతో సత్కరించారు.