మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం శివారు నేలారిపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త యన్నమళ్ళ రమణయ్య సతీమణి పద్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురు వారం ఆమె దశదిన కర్మకాండల సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు వారి ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి భర్త రమణయ్య కుటుంభాన్ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టెం సాయి, నాయ కులు శ్రీరాముల రమేష్, సీనియర్ నాయకులు విశ్రాంతి ఉపా ధ్యాయులు కాళ్ళ సుందర్ రావు, ఎస్సీ సెల్ నేత సాధన పల్లి శ్రీను, గుండమల్ల కిరణ్, లకుమళ్ళ మోహన్, ఇంకా పలువురు బంధువులు, గ్రామస్తులు, పెద్దలు, పెద్ద సంఖ్యలో హాజరై సంతా పం వ్యక్తం చేశారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment