మృతుని కుటంబానికి పరామర్శ
– నిత్యావసర సరుకులు అందచేత
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలం లోని బుట్టా యిగూడెం గ్రామానికి చెందిన జాడి మల్లయ్య తండ్రి జాడి దుర్గయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం జాడి మల్లయ్య బాల్య మిత్రుల బృందం పరామర్శించారు. మృతుని కుటుంబానికి ఒక రైస్ బ్యాగ్ తో పాటుగా నిత్యావసర సరుకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో దుర్గం రాజు (ఆంధ్రజ్యోతి రిపోర్టర్), కుమ్మరి నర్సింగరావు, గాంధేర్ల సమ్మయ్య, జాడి సత్యం, జాడి జనార్ధన్, కుమ్మరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.