మృతుల కుటుంబాలకు పరామర్శ
మృతుల కుటుంబాలకు పరామర్శ
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : నిరుపేద మృతుల కుటుంబాలకు సాయం అందించిన సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మహబూబాబాద్ సబ్ రిజి స్ట్రార్ తస్లీమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి తౌటం దయాక ర్, నల్లగుంట గ్రామ పరిధి గంపోనిపల్లికి చెందిన గంప కొంరెల్లి లు ఇటీవలే అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకు న్న తస్లీమా ఆదివారం వెళ్ళి బాధిత కుటుంబాల సభ్యులను పరామర్శించారు. వారి మరణం బాధాకరమని మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు కుటుంబా లకు 50 కేజీల చొప్పున బియ్యం మరియు నిత్యావసర సరు కులు అందించి సహృధయాన్ని చాటుకున్నారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ సభ్యులు, గ్రామ స్థులు, తదితరులు ఉన్నారు.