బొల్లారంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. 

బొల్లారంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. 

  • జగన్నాధపురం ఎన్హెచ్ పై వాహనాల తణికిలు.  

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం బొల్లారం ఆదివాసి గ్రామంలో బుధవారం ఉదయం వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమములో భాగంగా ఊరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడి, యువత చేడు వ్యసనాలకు బానిసలు కావొద్దని, విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. బడి వయస్సు పిల్లలను సక్రమంగా చదివించాలని,కోరుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు . గ్రామం లో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని, అనుమానిత వ్యక్తులు గాని వచ్చిన,లేదా పరిసర ప్రాంతాలలో సంచరించిన , కనిపించిన పోలీస్ వారికి తెలియజేయాలని కోరడం జరిగింది. అలాగే ఏదైనా సమస్య ఉండి పోలీస్ స్టేషన్ కి రావాల్సి వస్తే ఎటువంటి మద్య వర్తులను సంప్ర దించకుండా నేరుగా పోలీసుస్టేషన్ కి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. అలాగే ఆయా ప్రబుత్వ శాఖకి చెందిన సమస్యలు ఉన్నా, వాజేడు పోలీస్ వారిని సంప్రదించినట్లైతే ఆయా శాఖల అదికారులు తో సమన్వయం తో,సమస్య పరిష్కారం కొరకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ఎస్.ఐ .వెంకటేశ్వరరావు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో అవగాహనా కల్ఫించారు. గ్రామంలో గుడుంబా మహమ్మరిని ఊర్లో తయారుచేయడం గాని, బయట నుండి తెచ్చి అమ్మడం గాని చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమములో సివిల్ మరియు ,సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. బొల్లారంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనంతరం వాజేడు పి.ఎస్ పరిధిలోని జగన్నాధపురం వై జంక్షన్ వద్ద వచ్చే పోయే వాహనాలను ఎస్.ఐ. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహన దారుడు ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, పరిమిత సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. అలాగే వాహనాల్లో ప్రయాణిస్తున్న అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఈ కార్యక్రమంలో వాజెడు సివిల్ పోలీస్ తో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బొల్లారంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.