ఎన్ హెచ్ ఆర్ సి క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ టిఎస్ దివాకర

ఎన్ హెచ్ ఆర్ సి క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ టిఎస్ దివాకర

ఎన్ హెచ్ ఆర్ సి క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ టిఎస్ దివాకర

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర కమిటీ క్యాలెండర్ ను ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. అనం తరం ఆర్టీవో శ్రీనివాస్ కు క్యాలెండర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ పోరిక రవీందర్, గోగులమూడి హరికృష్ణ,వెంకటాపురం సభ్యులు, స్టేట్ సోషల్ మీడియా కో కన్వీనర్ కోడిపాక రవి, జిల్లా అధికార ప్రతినిధి కట్టయ్య యాదవ్, మల్లంపల్లి, ములుగు వెంకటాపూర్, గోవిందరావుపేట, కన్నాయిగూడెం మండలాల అధ్యక్షులు గట్ల రవి, రాము, ఎన బోతుల రాజు, కొండి రమేష్, చునార్కని శ్యామ్, ములుగు పట్టణ అధ్యక్షురాలు ఉప్పుల కోమ ల, ములుగు మండల ఉపాధ్యక్షుడు బుద్దె మల్లయ్య, వెంకటాపూర్ మండల ప్రధాన కార్యదర్శి వెలిశోజు లతా ప్రేమ్ సాగర్, ములుగు పట్టణ ప్రధానకార్యదర్శి బలుగూరి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment