వరద ముంపు ప్రాంతాలను పర్యవేక్షించిన కలెక్టర్
వరద ముంపు ప్రాంతాలను పర్యవేక్షించిన కలెక్టర్
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం, డిసెంబర్ 06:జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముందస్తు చర్యల్లో భాగంగా వరద ముంపు ప్రాంతాలైన దొడ్ల,కొండాయి, మేడారం గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కొండాయి ,దొడ్ల గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ రాబోవు 24 గంటలలో అకాల వర్షాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో కొట్టుకుపోయిన కొండాయి బ్రిడ్జిని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ శాఖ అధికారులు,ఈ ఈ వెంకటేశ్వర్లు, డీఈ రఘువీర్,ఏఈ ప్రమోద్ తదితరులు ఉన్నారు.