చేవెళ్లలో సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Written by telangana jyothi

Published on:

చేవెళ్లలో సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలి

– బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ 

– తహసీల్దార్ కు వినతి 

ములుగు ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ తో పాటు ఇతర హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్ధన్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం తహసీల్దార్ విజయ్ భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడగానే వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మరిచి పోయారన్నారు. దళితులకు అంబేద్కర్ అభయ హస్తం, స్వయం ఉపాధి కోసం రుణాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు, ప్రత్యేక వసతి గృహాల నిర్మాణం, రూ.6లక్షలతో ఇండ్ల నిర్మాణం చేపడుతామని చెప్పి అసెంబ్లీ బడ్జెట్ లో కేటాయించకపోవడం దళితులపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గాదం కుమార్, ఎస్టీ మోర్చా రాష్ర్ట ప్రదాన కార్యదర్శి కొత్త సురేందర్, బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి నగరపు రమేశ్, జిల్లా కార్యదర్శి ఎస్.రవింద్రాచారి, గంగా, పులి ప్రవీణ్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment