విద్యార్థుల మరణాలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి
– హాస్టల్ దుస్థితిపై కనీస సమీక్ష పెట్టలేదు
– సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నియమించాలి
– భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ములుగు జిల్లా నాయకులు దుర్గం రాజ్ కుమార్
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : విద్యార్థుల మరణా లకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ములుగు జిల్లా నాయకులు దుర్గం రాజ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లోనే 48 మంది విద్యార్థులు చని పోయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంద న్నారు. సీఎం విద్యాశాఖ మంత్రి దగ్గర పెట్టుకొని విద్యార్థుల బాధలు తెలుసుకోకపోవడం బాధాకరమన్నారు. హాస్టల్ల సమస్యలపై మీకు టైం లేదు కానీ విహారయాత్రలకు ఢిల్లీకి వెళ్లడానికి సమయం ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగా ణలో గురుకులాల మీద సమీక్ష కూడా నిర్వహించక పోవడం దౌర్భాగ్యం అన్నారు. అదే విధంగా నిమ్స్ లో 20 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయిన వాంకిడి విద్యార్థి శైలజ తో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురు కులాల్లో వివిధ కారణాలతో చనిపోయిన విద్యార్థుల కుటుం బాలకు టిఆర్ఎస్ తరఫున ప్రగడ సంతాపం తెలిపారు. తల్లి దండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థాయి చదువులు చదవాలని గురుకులాలకు పంపిస్తే ఈ సర్కార్ 48 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నారన్నారు. ఆ తల్లిదండ్రుల కడుపు కోత వేరే వాళ్లకు రాకుండా పోరాడాలని గుర్తు చేశారు. ఇప్పటి వరకు గురుకులాల దుస్థితిపై సీఎం ఒక్క సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. అదేవిధంగా చనిపోయిన విద్యార్థులకు ప్రభు త్వమే ఆదుకోవాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం దుర్గం రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.