ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి ఉప కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం.
- మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవ్యశ్రీ.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిదిలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలు భవనాల పరిసరాల్లో బుధవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవ్య శ్రీ పర్యవేక్షణలో ఉప కేంద్రాలు, పల్లె దవాఖానాల పరిసరాల్లో ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ఆలు బాక గ్రామంలో పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎదిర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవ్యశ్రీ పర్యవేక్షించి, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సినేషన్ విషయంపై పలు విషయాలపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా ఆరోగ్య కేంద్రాలు ఏఎన్ఎం లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు.లో పాల్గొన్నారు.