ఆర్ వై వీ లో సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తివేయాలి

ఆర్ వై వీ లో సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తివేయాలి

ఆర్ వై వీ లో సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తివేయాలి

– తెలంగాణ ప్రజా ఫ్రంట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్

కాటారం, తెలంగాణ జ్యోతి : రాజీవ్ యువ వికాస పథకంలో సిబిల్ స్కోర్ నిబంధన తెలంగాణ ప్రజా ఫ్రంట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం కాటారంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండించారు. సిబిల్ స్కోర్ నిబంధన వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బి సి, మైనారిటీ ఇబీసీ లలో ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ 6 వేల కోట్ల 5లక్షల మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయం చేసి దరఖాస్థులు స్వీకరించింది. ప్రభుత్వ నిర్ణయతో 16 లక్షల మంది నిరుద్యోగ యువత, నిరుపేదలు, దళితులు గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్థులు స్వీకారణ పూర్తి అయిన తరువాత సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం లబ్ధిదారుల నోట్లో మట్టికోట్టడమే అవుతుంది విమర్శించారు. అంబేద్కర్ అభయహస్తం పేరుతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి నిరుపేద దళితునికి 12 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీ రూపాన ఇస్తామని అన్నారు ఇప్పటివరకు ఊసే లేదని, 1లక్ష నుండి 4లక్షల నిబంధనతో పేదల బతుకుల్లో ఎలాంటి మార్పు రాదని అన్నారు. కనీసం 10లక్షలు వరకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిచలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధన ఎవరి ప్రయోజనలకోసం. ప్రభుత్వం నిర్ణయం వలన అనేక మంది పేదలకు ఒక్కరికి కూడా రాజీవ్ యువ వికాసం రుణాలు వచ్చే అవకాశం లేదనీ అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోర్ నిబంధనను ఎత్తివేయాలని పీక కిరణ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి సహాయ కార్యదర్శి మినుగు నగేష్ జిల్లా కార్యవర్గ సభ్యుడు దారకొండ సూర్యశంకర్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment