బోదాపురంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.

బోదాపురంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.

– హాజరైన వెంకటాపురం మండల వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్. 

– వందమంది కి నూతన వస్త్రములు పంపిణీ.

 వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యతి ప్రతినిది : ములుగు జిల్లా,వెంకటాపురం మండలం బోధపురం గ్రామపంచా యతీలో, సోమవారం క్రిస్టమస్ పండుగ పర్వదినం సందర్భంగా ,ఏసుక్రీస్తు ప్రార్ధన మందిరంలో 100 మంది మహిళలకు నూతన వస్తువులు స్థానిక సంఘ కాపరి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ కార్యక్ర మానికి వెంకటాపురం మండల వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్ హాజరై నూతన వస్త్రాలు ను ఆయన చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినం పండుగ సందర్భంగా వందమంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరమని ,ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అనేకమందికి రక్షకుడుగా ఉన్నాడని ఇటువంటి పండుగలు జరుపుకోవడం చాలా సంతోషమని వారన్నారు. అనంతరం సంఘ కాపరి కర్ని లూకా క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఏసుక్రీస్తు లోక రక్షకుడు అని యేసు క్రీస్తు ద్వారా శాంతి సమాధానం కలుగుతుం దని, ప్రపంచ దేశాలలో పండుగగా నిర్వహించుకునే ఏకైక పండుగ క్రిస్టమస్ అని అయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వాసు లు ఇస్సాకు ,నరేష్, మహేష్, ఇర్మియ య,విక్టోరియా, రుతమ్మ దయావతి శార ,సపోర, కౌసల్య, సంఘ పెద్దలు విశ్వాసులు గ్రామ స్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.