వెంకటాపురం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చిట్టెం సాయి కృష్ణ 

వెంకటాపురం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చిట్టెం సాయి కృష్ణ 

వెంకటాపురం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చిట్టెం సాయి కృష్ణ 

   వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : భద్రాచలం నియోజక వర్గం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా చిట్టెం సాయి కృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఎన్నికల నియమా వళి ప్రకారం జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియ నిర్వహించింది. ఆన్లైన్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పార్టీ వెంకటాపురం మండల అధ్యక్షునిగా వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ఉత్సాహవంతుడైన యువకు డు, విద్యావంతుడయిన చిట్టెం సాయికృష్ణ అత్యదిక, ఆన్లైన్ ఓట్ల ద్వారా ఎన్నికయ్యారు. ప్రజా విజయోత్సవాల వేడుకల సంధర్బంగా ఎన్నికల ఫలితాలను పార్టి విడుదల చేసింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గా ఎన్నికైన చిట్టెం సాయికృష్ణ స్వామికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు సయ్యధ్ హు స్సేన్, పిఎసిఎస్ అధ్యక్షులు,సీనియర్ నేత చిడెం మోహన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రమేష్, ఇంకా పలువురు నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూత నంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టెం సాయి కృష్ణ స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరు స్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలో పేతానికి కృషి చేస్తానని, పార్టీకి కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, కాంగ్రెస్ పార్టీ జెండాను గ్రామ, గ్రామాన ఎగిరే విధంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువ జన కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలను, సీనియర్ నాయ కుల పర్యవేక్షణ లో పార్టీ సైనికులుగా పని చేస్తామని, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటామని ఈ సంద ర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.