Voter ID | ఓటరు జాబితాలో పేరు పరిశీలించుకోండి
– ప్రత్యేక అధికారి బోయపాటి చెన్నయ్య
ములుగు ప్రతినిధి : 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరు గా పేరు నమోదు చేసుకోవాలని, తమ పేర్లను పరిశీలించు కోవాలని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే లో భాగంగా ప్రతి బూత్ స్థాయి అధికారి ప్రతి ఒక్క ఓటరు ఇంటికి వెళ్లి వివరాలను సరిచూడాలని రాష్ర్ట ఎన్నికల ముఖ్య కార్యాలయ ప్రత్యేక అధికారి బోయపాటి చెన్నయ్య సూచించారు. స్పెషల్ సమ్మర్ రివిజన్ 2025 కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్డీవో సత్యపాల్ రెడ్డితో కలిసి ఎన్నికల అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ 2025 జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన ఓటర్లుగా నమోదు చేయాలని, అందుకుగాను అడ్వాన్స్ అప్లికేషన్ తీసుకోవాలని, కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని సూచించారు. షిఫ్టెడ్, డబుల్ పేర్లు, మరణించిన ఓటర్ జాబితాను తయారుచేసి జాబితా నుంచి తొలగించాలన్నారు. బూత్ స్థాయి అధికారు లు నిర్లక్ష్యం చేయకుండా విధులు సక్రమంగా నిర్వహిం చాలని, గడువులోగా ఇంటింటి సర్వే పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితాలో పేరు సరిచూసుకునేందుకు ఈ లింక్ (https://electoralsearch.eci.gov.in/) ను ఓపెన్ చేసు కోండి.. అందులో ఎపిక్ నెంబర్ కానీ, పేరు కానీ, ఫోన్ నెంబర్ ను కానీ ఎంటర్ చేస్తే మీ వివరాలు వస్తాయని తెలిపారు.