చలో బిసి గర్జన పోస్టర్ ఆవిష్కరణ

చలో బిసి గర్జన పోస్టర్ ఆవిష్కరణ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : చలో బీసీ గర్జన పేరిట ఫిబ్రవరి 2 న వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించ తలపెట్టిన బీసీ గర్జన మహాసభకు అధిక సంఖ్యలో బీసీ కులాలు హాజరుకావాలని కాటారం సబ్ డివిజన్ పరిధిలోని 5 మండలాల వివిధ కుల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద కుల సంఘాల నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. జాతీయ బీసీ సంఘం జిల్లా ఇన్చార్జి విజయగిరి సమ్మయ్య ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బీసీ ఇంటర్నేషనల్ ఫోరం, జిల్లా అధ్యక్షులు పెండ్యాల సంపత్, కాటారం డివిజన్ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరన లో బీసీ సంఘాల నాయకులు డబ్బేట రాజేష్, అందే భాస్కర్, చీమల రాజు, కొట్టే సతీష్, మాచర్ల రాజేందర్, కొట్టే ప్రభాకర్, బోయిన్ రాజయ్య, మారగోని శంకర్ గౌడ్, అంగజాల అశోక్, బుర్ర లక్ష్మణ్ గౌడ్, పసుల మొగిలి, భద్రపు సమ్మయ్య, అరీగేల వెంకట్రాజం గౌడ్, బాలయ్య, కోయ్యల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.