ఢిల్లీలో బీజేపీ గెలుపు పట్ల సంబరాలు

ఢిల్లీలో బీజేపీ గెలుపు పట్ల సంబరాలు

ఢిల్లీలో బీజేపీ గెలుపు పట్ల సంబరాలు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించిన సందర్బంగా బీజేపీ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తలు శనివారం మిఠాయిలు ఒకరికి ఒకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు. ఈ సందర్బంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ పాలన పై నమ్మకంతో బీజేపీ పార్టీకి ఓటు వేశారని, డబుల్ ఇంజన్ సర్కార్ పై విశ్వాసం తో ఓటు వేశారని అన్నారు. ఢిల్లీ ఎన్నికల విజయం స్ఫూర్తి తో తెలంగాణ రాష్ట్రo లో జరిగే మూడు ఎం ఎల్ సీ స్థానాలలో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. స్థానిక ఎన్నికలో కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రజలు తప్పకుండా అందరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు జిల్లెల శ్రీశైలం, నాయకులు బొంతల రవి ముదిరాజ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.