అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

Written by telangana jyothi

Updated on:

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

– రెండు వాహనాలు సీజ్​

ములుగు ప్రతినిధి : అనుమతి లేకుండా అక్రమంగా తరలి స్తున్న పశువులను పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై వెంక టేశ్వర్​ రావు తెలిపారు. శనివారం మల్లంపల్లి హనుమాన్ వేబ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు చేపట్టగా ములుగు నుంచి మల్లంపల్లి వైపు వెళ్తున్న టీఎస్​ 25 టీ 3899, టీఎస్​ 03 యూడీ 1223 నెంబర్లుగల వాహనాల్లో 4 ఆవులు, 5 ఎద్దు లు, 3 గేదెలను బంధించి అతివేగంగా వెళ్తున్నారు. వాహ నాలు ఆపకుండా అజాగ్రత్తగా వెల్తున్న క్రమంలో పోలీసులు వెంబడించి మల్లంపల్లి శివం గార్డెన్స్​ సమీపంలో పట్టుకు న్నారు. పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి గోశాలకు తరలించామని, కారకు లైన మహ్మద్​ అన్వర్​, జానపట్ల రాజ్​కుమార్​, ఎస్కే షకీల్​ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now