రాజకీయ కక్షతోనే కేసులు
– మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నేత జోడు శ్రీనివాస్ ఆరోపణ
కాటారం,తెలంగాణ జ్యోతి ప్రతినిధి: అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో పోలీసులు అకారణంగా కేసులు నమోదు చేస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ జోడు శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం కాటారంలో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కాటారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల సిబ్బంది దురుసుగా వ్యవహరించారని విషయంపై ఆసుపత్రిలో వాస్తవాలను తెలుసుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ నాయకుడి పై ఆసుపత్రి వర్గాలు కేసు పెట్టారని తెలిపారు. ఆసుపత్రిలో అధి కార పార్టీ నాయకుల అండదండతో ఆసుపత్రి వర్గాలు వైద్య సేవలు అందించడం కాకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఉపాధ్యక్షులు ఊర వెంకటేశ్వరరావు, కొండ గొర్ల వెంకటస్వామి, గాలి సడవలి, ఉప్పు సంతోష్, జక్కు శ్రావన్, దుర్గారావు, జాడి శ్రీశైలం, రామిల్ల రాజబాబు, మానెం రాజబాబు, వంగల రాజేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.