BSNL | ఇతర కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్.!

Written by telangana jyothi

Published on:

BSNL | ఇతర కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్.!

– ఇక సిమ్ లేకుండానే కాల్స్..?

– డైరెక్ట్ టు డివైజ్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ 

ఇంటర్నెట్ డెస్క్ : గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వియాసత్‌తో కలిసి సరికొత్త సేవలు అందుబాటులోకి మొబైల్ టవర్లతో పనిలేకుండానే ఫోన్ కాల్స్ ఇక అంత రాయం లేని సేవలు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లు కూడా శాటిలైట్ కమ్యూనికేషన్  విజయ వంతంగా ట్రయల్స్. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోమారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసత్’ తో కలిసి ‘డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) సాంకేతికతను అందు బాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఇద్దరికీ ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాదు, స్మార్ట్ వాచ్‌తోపాటు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్ డివైజ్‌లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతోనే ఈ సాంకేతికత ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

                                                      డైరెక్ట్ టు డివైజ్

సాంకేతికతతో సిమ్‌కార్డు లేకుండానే మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు,కార్ల యజమానులు కూడా నేరుగా శాటిలైట్ నెట్‌ వర్క్‌తో అనుసంధానం కావొచ్చు. పర్సనల్, డివైజ్ కమ్యూ నికేషన్‌కు సపోర్ట్ చేసేలా దీనిని డిజైన్ చేశారు. ఎక్కడు న్నామన్న దానితో సంబంధం లేకుండా నిరంతర కనెక్టివిటీని ఇది అందిస్తుంది. యూజర్లకు ఇది గొప్ప కవరేజీ ఇవ్వడంతో పాటునమ్మకమైన కమ్యూనికేషన్ అందిస్తుంది.మరీ ముఖ్యం గా మారుమూల ప్రాంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

మొబైల్ టవర్లతో పనిలేదు

శాటిలైట్ కమ్యూనికేషన్‌లో భాగమైన డైరెక్ట్ టు డివైజ్ సేవల్లో ఇక మొబైల్ టవర్లతో పని ఉండదు. ఇంకా చెప్పాలంటే శాటిలైట్ ఫోన్లలా అన్నమాట. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లను నేరుగా ఈ టెక్నాలజీ సాయంతో అంతరాయం లేని కాల్స్ మాట్లాడుకోవచ్చు. ట్రయల్స్‌లో భాగంగా 36 వేల కిలోమీటర్ల దూరంలోని ఉపగ్రహాన్ని ఉపయోగించి దిగ్విజయంగా ఫోన్ కాల్ చేయడం జరిగింది.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now