అనారోగ్యంతో బి ఆర్ ఎస్ కార్యకర్త మృతి
అనారోగ్యంతో బి ఆర్ ఎస్ కార్యకర్త మృతి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన టిఆర్ఎ స్ పార్టీ కార్యకర్త గార వెంకటేశ్వర రావు అనారోగ్యంతో బుధ వారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న వాజేడు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెనుమళ్ళ రామకృష్ణా రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు వెంకటేశ్వరరావు కుటుం బాన్ని పరామర్శించి నివాళులర్పించారు. కుటుంబానికి బిఆ ర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని ఓదార్చారు. అంత్య క్రియలు నిమిత్తం బిఆర్ఎస్ వాజేడు మండల పార్టీ తరఫున 5 వేల రూ. నగదును కుటుంబ సభ్యులకు మండల పార్టీ అధ్యక్షులు పెనుమళ్ళ రామకృష్ణారెడ్డి అందజేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొల్లి సత్యం, కొత్తగట్టు సాంబమూర్తి, గొంది రమణా రావు, చెన్నం సాంబశివరావు, షేక్ నిజాముద్దీన్, గార తిరుపతి, కె. రాజు, సుధాకర్, జి. ప్రకాష్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.