చెరువుల హద్దులు నిర్ణయించాలని బి ఆర్ ఎస్ వినతి

చెరువుల హద్దులు నిర్ణయించాలని బి ఆర్ ఎస్ వినతి

చెరువుల హద్దులు నిర్ణయించాలని బి ఆర్ ఎస్ వినతి

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాటారం మండలం కాటారం గ్రామ పంచా యతీ పరిధి లోని చెరువులన్నిటి ఎఫ్ టీ ఎల్ హద్దులను నిర్ణయిం చి, భవిష్యత్ తరాల అవసరాల కోసం ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని కాటారం మండల బీఆర్ఎస్ మండల ఇన్చా ర్జి జోడు శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు రామిళ్ళ కిరణ్, జక్కు శ్రవణ్, చల్ల శేఖర్ తదితరులు సోమవారం ప్రజావాణి లో లేఖ అందజేశారు. ప్రతి పాదిత మినీ స్టేడియం చుట్టూ ఆక్రమిం చిన, ఆక్రమణ దారుల నిర్మాణాలపై, చట్ట పరమైన చర్యలను తీసుకోవాలని, స్టేడి యం పూర్తి స్థాయి ఐదు ఎకరాల పైచిలుకు భూమికి, హద్దు లు నిర్ణయించాలని ప్రజావాణిలో బిఆర్ఎస్ పార్టీ కాటారం మండల శాఖ దరఖాస్తును అందజేసింది.