తక్కువ ధరతో ధాన్యాన్ని దోసుకుంటున్న దళారులు

Written by telangana jyothi

Published on:

తక్కువ ధరతో ధాన్యాన్ని దోసుకుంటున్న దళారులు

– సీజనల్ మామూళ్ళు మత్తులో అధికారులు. 

– యదేచ్చగా దళారి గిరిజన దోపిడీ. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఖరీఫ్ సీజన్లో ఏర్పాటు చేసిన వడ్డీ వ్యాపారులు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారులు, దళారీలు, రైతులు వద్ద పచ్చి ధాన్యం పేరుతో ప్రభుత్వ ధర కంటే కింటాలుకు 700 నుండి, 800 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తు దోసుకుంటున్నారు. అంతేకాక పట్టికట్టు తో కనికట్టు తూకాలు వేసి కింటాకు 4 నుండి 5 కిలోలు అదనం గా తప్పుడు తూకంతో దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడి దారులు తాము పెట్టిన పెట్టుబడులకు పది రూపాయలు వడ్డీతో పాటు, మిగతా పెట్టు బడి బాకీల రికవరీల నిమిత్తం కళ్ళాల వద్దకే కాంటాలు, లారీలతో వెళ్ళి ధాన్యాన్ని స్వాదీనం చేసు కొని బాకీల క్రింద జమ వేసుకుంటున్నారు. థాన్యం కల్లాల వద్దకే లారీలతో వెళ్లి, పడికట్టు, కనికట్టుతో ప్రభుత్వ ధర కంటే 800 రూపాయలు కింటాలుకు తక్కువగా చేసి తెల్ల బస్తాలలో లోడింగ్ చేసుకొని రైతులను దోసుకుంటూ, రైతులు పేరు మీదనే ఆన్లైన్ ద్వారా వే బిల్లు తెప్పించుకొని తరలించుకు పోతున్నారు. అంతేకాక ఆన్లైన్ వే బిల్లులలో అనేక నిబంధన లను ఉల్లంఘించి, రోజుకి 20 నుండి 30 లారీలు కు పైగా లారీలు, డీసీఎంలలో ధాన్యం తరలించుకు పోతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వాజేడు మండలం పూసూరు గోదావరి వంతెన వద్ద, మరియు చర్ల మండలం లో చెక్ పోస్టులు ఉన్న, చెక్ పోస్ట్లు వద్ద సెస్ లు చెల్లించకుండా మామూళ్ళు చెల్లించి, భద్రాది కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాల మిల్లర్లకు తరలించుకు పోతున్నారు. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో సన్న రకం ధాన్యానికి 100 కిలోలకు 2వేల320 రూపాయలు, మరియు 500 రూపాయలు బోనస్ ప్రకటించింది. అలాగే కామన్ రకాలకు 100 కిలోలకు 2,వెల320 రూపాయలు వంతున ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేందుకు మద్దతుధరలను ప్రకటించింది. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తే వచ్చే ఏడాది పెట్టుబడులు పెట్టమని, వడ్డీ వ్యాపారాలు, దళారులు, డీలర్లు రైతులను బెదిరించి, దోపిడీ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎం.టి.యు 1000 1 అనే రకం ధాన్యాన్ని చతిస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు రాత్రి కిరాత్రి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వాజేడు మండలం చెరుకూరు వద్ద మామూలు చెల్లించి తరలించుకు పోతున్నారు. 50% శాతం పైగా పచ్చి ధాన్యం పేరుతో దళారీలు దోచుకున్నట్లు రైతులు చెబుతున్నారు. తక్కువ ధరకు రైతులు వద్ద కొను గోలు చేసి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో,థళారీలు ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకొని ,లబ్ధి పొందుతు న్నట్లు ఆరోపణ వెళ్ళి వెత్తుతున్నాయి. పౌరస రఫరాల శాఖ విజిలెన్స్, మరియు తూనికల కొలతలు శాఖ, వాణిజ్య పన్నుల శాఖ , రెవెన్యూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికా రులు వెంటనే స్పందించి తెల్ల బస్తాలతో ధాన్యం దొంగ కాంటాలు వేసీ రైతులను దోచుకుంటూ, రైతులు పేరుతో తరలిస్తున్న దొంగ వ్యాపారులు , ఎరువులు పురుగుమందుల వ్యాపారులపై కేసులు నమోదు చేసి నిత్యవసరాల సరుకుల చట్టం 6ఏ కింద కేసులు నమోదు చేయాలని, ధాన్యం దళారుల పై పీ.డీ. యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని, గిరిజన సంఘాలు, రైతు సంఘాలు పత్రికా ముఖంగా ములుగు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now