దశదిన కర్మకు బ్రాహ్మణ సంఘం ఆర్థిక సహాయం.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో బ్రతుకుతెరువు కోసం వచ్చి గోదావరి తీరంలో పూజ వస్తువులు అమ్ము కుంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన దుగ్నే లక్ష్మణ్ అనారోగ్య కారణాలతో గత పది రోజుల కిందట మరణిం చాడు. దానితో బ్రాహ్మణ సంఘం సభ్యులు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసి, దశదినకర్మకు కావల సిన నిత్యవసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామగుండం రాజేంద్ర ప్రసాద్, ఆరుట్ల వెంకటేశ్వరరావు చార్యులు, మాడుగుల పవన్ శర్మ, భాస్కర శర్మ,శ్రీనివాస శర్మ, నారాయణమూర్తి, రామమూర్తి, ముక్తేశ్వర శర్మ, లక్ష్మీనారాయణ శర్మ, సతీష్ శర్మ, మహేష్ శర్మ, సత్యనారాయణ శర్మ, విట్టల్ శర్మ, సాత్విక్, సాయి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అందరికీ సహాయకారిగా ఉంటూ, నిరుపేదలకు ఆపన్న హస్తం అంది స్తున్న బ్రాహ్మణ సంఘం ను పలువురు అభినందించారు.