హద్దులు దాటిన అభిమానం
– రక్తంతో పుట్ట దంపతుల ఫోటో ఆర్ట్
కాటారం, తెలంగాణ జ్యోతి : సాధారణంగా అభిమానానికి ఓ హద్దు ఉంటుంది. రాజకీయ నాయకుడికైనా సినిమా హిరోకైనా అభిమానులు ఉండటం సహజం…వారివారి అభిమానాన్ని వివిధ రూపాల్లో చాటుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు బిన్నంగా అభిమానం హద్దు దాటి ఓ అడుగు ముందుకు వేసింది. ఓ అభిమాని తన అభిమాన నాయకుడి చిత్రాన్ని ఏకంగా తన రక్తంతోనే తీర్చిదిద్దాడు. కాటారం మండలం కేంద్రానికి చెందిన మున్నా అనే మైనార్టీ యువకుడు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు వీరాభిమాని..అయితే మున్నా తన అభిమాన నాయకుడు పుట్ట మధూకర్ శైలజ దంపతుల ఫోటోను తన రక్తంతో ఆర్ట్ వేశాడు. శనివారం కాటారం మండల కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో మున్నా ఆర్ట్ వేసిన పుట్ట దంపతుల చిత్రాన్ని అభిమాన నాయకుడు పుట్ట మధూకర్‌కు అందజేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మొదట ఆశ్చర్యానికి గురైనా తనంటే ఇంత అభిమానం ఉన్న అభిమాని దొరకడం అదృష్టమంటూ యువకుడిని అభినందించారు.