బోదాపురం గ్రామస్తులకు మంచినీటి కష్టాలు

బోదాపురం గ్రామస్తులకు మంచినీటి కష్టాలు

బోదాపురం గ్రామస్తులకు మంచినీటి కష్టాలు

– పట్టించుకోని గ్రామపంచాయతీ

వెంకటాపురం నూగూరు,తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురం పంచాయతీ కేంద్రంలో గత 4 నెలల క్రితం పంచాయతీ బోరు మరమ్మత్తులకు గురై  త్రాగు నీటి కష్టాలను గ్రామస్తులు ఎదురు కొంటున్నారు. బోరుబావి నుండి నీళ్లు రెండు మూడు బిందెల కంటే ఎక్కువ సరఫరా కావడం లేదని, దీంతో గ్రామస్తులు సమీపంలో ఉన్న పురాతన భావి నుండి నీటిని తెచ్చుకొని ఇబ్బందులు పాలవుతున్నారు. గ్రామ ప్రజలందరూ ఒకే భావి వద్ద నీటిని బకెట్లతో తోడటం వల్ల బావిలో కూడా నీరు అడుగంటిపోయి బావి నుండి రంగు మారిన నీరు వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. మంచినీటి బోరు మరమ్మత్తులు చేయాలని బోదాపురం పంచాయతీ కార్యదర్శి అధికారులకు పలుమార్లు విన్నవించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, బోరు మరమ్మత్తులు చేయటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు వెంటనే స్పందించి మంచినీటి సమస్య పరిష్కరించాలని, బోధాపురం గ్రామ ప్రజలు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment