చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.
చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం అటవీశాఖ రేంజి ఆఫీసర్ చంద్రమౌళి సహకారంతో బోగత జలపాతం వద్ద చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం సోమవారం నిర్వహించారు. వాజేడు రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి, బొగత సెక్షన్ ఆఫీసర్ గొంది నారాయణ, బొగత బీట్ ఆఫీసర్ కవిత ఆధ్వర్యంలో, 20 యూనిట్ల రక్తం ను ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రి వారికి అందజేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు, చీకుపల్లి గ్రామ యువత, గుమ్మడిదొడ్డి గ్రామ యువత రక్తదానం చేసి, మానవత్వాన్ని చాటుకున్నారు .బొగత సిబ్బంది కూడా రక్తదానం చేశారు. ఈ శిబిరంలో గుమ్మడిదొడ్డి యూత్ లీడర్ బోదే బోయిన భరత్, చీకుపల్లి యూత్ లీడర్ బోధ బోయిన వికాస్ , నాగారం ప్రభుత్వ సిబ్బంది మల్లికా, మురళి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.చేయూత సంస్ద నిర్వహకులు సాయి ప్రకాష్ ను పలువురు అభినందించారు.