మతోన్మాద పార్టీ బిజెపి ని బొంద పెట్టాలి

Written by telangana jyothi

Published on:

మతోన్మాద పార్టీ బిజెపి ని బొంద పెట్టాలి

– ఇండియా కూటమి అయిన రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి

– కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి

– రాముని పేరుతో రాజకీయం చేయడం బిజెపికి సిగ్గుచేటు

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రాజకుమార్

– కాంగ్రెస్ పార్టీ పెద్ద పల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలి

మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మతోన్మాద పార్టీ అయి న బిజెపి ని ప్రజలు ఎవరు నమ్మవద్దని ఇండియా కూటమి అయినా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధాని ని చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రాజకుమార్ అన్నారు. శనివారంనాడు జయశంకర్ జిల్లా భూపాలపల్లి మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోట రాజబాపు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అధితులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాశ్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రాజు కుమార్ హజరై మాట్లాడుతూ భారత దేశంలో జరుగుతున్న 18వ.పార్లమెంటు ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను ఈ ప్రాంతం ప్రజలు ఆదరించి ఎంపి గా భారీ మెజారిటీతో గెలిపించాలి అని అన్నారు.ఈ దేశంలో బిజెపి పార్టీ ప్రజలకు చేసింది ఎమి లేదు అని ఆదానికి అంబానికి ఆస్తులు కూడా పెట్టారని, రాముని పేరు తో ఓట్ల రాజకీయం చేస్తున్నారు అని ఇన్ని సంవత్స రాలైనా భద్రాచలంలో రాములవారికి నిధులు ఎందుకు కేటాయించలేదని మండిపడ్డారు. అదేవిదంగా ప్రజలు ఎవరు బిజెపి ని నమ్మొద్దు అని ఆయన తెలిపారు. కాంగ్రేస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆయిత ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగు తుందని మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పాంచ్ న్యాయ గ్యారెంటీ లు అమలు అవుతాయి అని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కేంద్రం లో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎలా ఓట్లు అడుగుతారని అన్నారు.నరేంద్ర మోడీ దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలు అన్ని ప్రైవేటీకరణ చేసి అధిక ధరలతో పేద మధ్యతరగతి ప్రజల నడ్డి ఇరుస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రజలందరికీ ముందు గా మే 13వ. తారీకున ఓట్లు ఉన్నందున ఎండ తీవ్రత జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రవల్లి విలాస్ రావు,మహాదేవపూర్ ఎంపీపీ బాన్సోడ రాణి బాయ్ రామారావు, జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కట్కం అశోక్, సీనియర్ నాయకులు వామన్ రావు,కోట సమ్మయ్య, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,సిద్ది శంకర్,ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు కుమార్, అత్కూరి శ్రీకాంత్, రాజేందర్,సిపిఐ, సిపియం ఐదు మండలాల నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now