ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి బిజెపి కుట్ర
వెంకటాపురం నూగూరు,తెలంగాణ జ్యోతి : ఉపాధి హామీ చట్టం నిర్విర్యానికి బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గ్యానం వాసు ఎద్దేవా చేశారు. రెండు నెలలుగా ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు సొమ్ములు చెల్లించక పోవడంతో, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు సోమవారం వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గ్యానం వాసు మాట్లాడారు. ఏప్రిల్, మే నెలలలో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసిన 6,501 మంది కార్మికులకు రెండు నెలలైనా వారికి చెల్లించాల్సిన సుమారు రూ. మూడు కోట్ల కూలీ సొమ్ములు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారన్నారు. పనులు చేసి ఎనిమిది వారాలు గడుస్తున్నా వారికి నేటికీ పే స్లిప్పులుఇవ్వకపోవడంతో ఎంత కూలీల సొమ్ములు వచ్చా యో తెలియని అయోమయ పరిస్థితి దాపురించిందన్నారు. తీవ్రమైన ఎండలో అరకోరా వసతుల మధ్య కూలీ పనులు చేసిన కార్మికుల కు కూలీ చెల్లింపు లు చేయడంతో, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. వెంటనే కూలీ సొమ్ములు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనులు చేసిన కుటుంబాలకు సొమ్ములు చెల్లించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వారం రోజుల్లో పే స్లిప్పులు అందజేస్తామని ఏ .పి .ఓ. హామీని ఇచ్చారు. 2 వారాల్లో కూలీ పని చేసిన కూలిలకు వేతనం అందేలా ఉన్నతాధికారుకారుల దృష్టి కి తీసుకుని వెళ్లి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో ఉపాధ్యక్షుడు కుమ్మరి శ్రీను, రైతు సంగం జిల్లా నాయకులు ఆదినారాయణ, హర్షవర్ధన్, సావిత్రి, విజయ్ అనిల్, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.