ములుగు లో ముగిసిన బీరన్న ఉత్సవాలు.

Written by telangana jyothi

Published on:

ములుగు లో ముగిసిన బీరన్న ఉత్సవాలు.

– చివరి రోజున అగ్నిగుండాలు దాటిన భక్తులు

తెలంగాణ జ్యోతి,  ములుగు ప్రతినిధి : యాదవుల ఇలవే ల్పు బీరన్న ఉత్సవాలు ముగిసాయి. వారంరోజులపాటు జరిగిన ఉత్సవాల్లో యాదవులు, బీరన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ములుగులోని పత్తిపల్లి రోడ్డులోగల బీరన్న ఆలయంలో బోనాలు సమర్పించి, పట్నం వేసి ఇలవేల్పులను కొలుచుకున్నారు. ఒగ్గు, బీరన్న పూజారులు, యాదవ కులపెద్దలు భక్తులకు బండారి (పసుపు) అందజేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమేతంగా వచ్చిన భక్తులతో వారంరోజులపాటు ములుగు పట్టణం సందడి వాతావరణం నెలకొంది. మొదటిరోజున గ్రామదేవతలకు నీల్లారగించి పాలు, నెయ్యి పోయడంతో మొదలైన ఉత్సవాలు చంద్రబలి, గంగబోనం, ఎదురుబోనం, లింగాలు చెరువు నుంచి తీయడం, తల్లిబోనం, లగ్గంబోనం, గావుపట్టడం, లగ్గం పట్నం, మందగావు, ప్రతీ ఇంటి నుంచి బోనం స్వామి వారికి సమర్పించడం, సందు బోనం, నాగెళ్లి పట్నం, మహంకాళి, కామరాతి, బీరన్న, భోగన్న వేషాలు, అగ్నిగుండాలు దాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజైన గురువారం గొర్లకు బాషింగాలు కట్టి, యాదవుల సాంప్రదాయం ప్రకారం పలకకొట్టే కార్యక్ర మాన్ని నిర్వహించడంతో ఉత్సవాలు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలో జరిగిన బీరన్న ఉత్సవాల్లో యాదవులు వారి కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలను పిలుచుకొని కొత్త బట్టలు పెట్టారు. నాలుగు రోజులపాటు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, ములుగులో బీరన్న ఆలయానికి గుడి నిర్మించడంతోపాటు మళ్లీ ఐదేళ్లకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

– ఉత్సవాలకు దాతల సహకారం.

బీరన్న ఉత్సవాలకు పలువురు దాతలు వారి సహకారాన్ని అందించగా ఉత్సవ కమిటీ సభ్యులు కృతజ్క్షతలు తెలిపారు. బండారు మోహన్​ కుమార్​ రూ.50వేలు, రాష్ర్ట మంత్రి సీతక్క రూ.లక్ష, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్​ బాబు రూ.50వేలు, ములుగులోని ప్రతీ యాదవ కుటుంబం నుంచి రూ.2500ల చొప్పున విరాళాలు సేకరిం చుకొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. నూత నంగా ఆలయ నిర్మాణం కోసం కూడా దాతలు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ, పూజా కమిటీ సభ్యులు గోపు చంద్రమళ్లు, గొర్రె అంకూస్​, బైకాని చిన్నకొమురయ్య, బైకాని బైకులు, ఇమ్మడి రమేష్​, కొనుపుల కుమార్​, బైకాని సాగర్​, గుండెబోయిన కుమార్​, ఒజ్జల లింగన్న, బైకాని నటరాజ్​, ఇమ్మడి భిక్షపతి, బండారి కుమార్​, గొర్రె సమ్మయ్య, జక్కుల రమేష్​, గోపు బొందయ్య, బోయిని రాజు, బోళ్ల రవి, గుండెబోయిన పోశాలు, ఎల్లావుల సమ్మయ్య, గండ్రకోట కుమార్​, ఇమ్మడి మల్లయ్య, బైకాని ప్రకాష్​, బైకాని రాజశేఖర్​, ఇమ్మడి రాజు, బొంతల వేణు, ఒజ్జల కుమార్​, బొంతల రాజు, గండ్రకోట సందీప్​, బాషబోయిన కుమార్​, నన్నెబోయిన లింగయ్య, ప్రకాష్​, గొర్రె జంపయ్య, గొర్రె రాజు, జక్కుల రమేష్​, నరేష్​, కృష్ణ, సంపత్​, చిన్న వోదెలు, మర్రి అఖిల్​,జక్కుల శ్రీకాంత్​, ఒజ్జెల ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.

1 thought on “ములుగు లో ముగిసిన బీరన్న ఉత్సవాలు.”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now