కార్తీక మాసం భగిని హస్త భోజనం
కార్తీక మాసం భగిని హస్త భోజనం
– సోదరులకు నూతన వస్త్ర ప్రధానం
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి:కార్తీక మాసంలో ప్రతి ఏడాది భగిని హస్తభోజనం కొరకు సోదరులను ఆహ్వానించి తోడబుట్టిన సోదరులకు తమ ఇంట భోజనం పెట్టి వారి ఆశీర్వాదాలు పొందటం సాప్రాదాయంగా కొన సాగుతున్నది. కాగా ములుగు జిల్లా మండల కేంద్రం వెంకటా పురం లో ఆదివారం వేల్పూరి చక్రధర్ సరిత దంప తులు తన తోడబుట్టిన అన్నయ్య అయిన కలకోట సంతోష్ కుమార్ గుప్తా ను సాదరంగా తమ ఇంటికి ఆహ్వానించి భగిని హస్త భోజనం వడ్డీంచారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు అన్న య్య కు అందజేసి శుభాశీస్సులు పొందారు. ఎవరు అయితే సోదరి హస్త భోజనం చేస్తారో వారు నరకాన్ని పొందా రని, యమ ధర్మరాజు దీవెనలు అంది స్తారని, పూజాఫలంతో భగవంతుని ఆశీస్సులు పొందుతా రని వేద పండితులు తెలిపారు. కార్తీక మాసం శుద్ద విజయ ను మంచి రోజుగా భావించి నేటికీ వెంకటాపురం ప్రాంతంలో ఈ దైవ పూజా సాంప్ర దాయం నిర్వహిస్తున్నారు.