జీ ఓ 3ను పునరుద్ధరించాలని భద్రాచలం ఐటీడీఏ ముట్టడి

జీ ఓ 3ను పునరుద్ధరించారని భద్రాచలం ఐటీడీఏ ముట్టడి

జీ ఓ 3ను పునరుద్ధరించాలని భద్రాచలం ఐటీడీఏ ముట్టడి

– గొండ్వాన సంక్షేమ పరిషత్ నిరుద్యోగులకు పిలుపు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఆంధ్రప్రదేశ్ లో జీవో నెంబర్ 3 పై పునరుద్ధరణ అంశమై వెంకటాపురం మండల కేంద్రంలో బుధవారం గొండ్వాన సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అథ్యక్షులు పూనెం ప్రతాప్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2000 సంవత్సరంలో షెడ్యూల్ ఏరియాలో స్థానిక రిజర్వేషన్ జీవో నెంబర్3 రిజర్వేషన్ కోట ద్వారా ఆదివాసి జాతుల నిరుద్యో గులకు 60 వేల ఉద్యోగాలు 29 శాఖలలో భర్తీ చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఆదివాసిల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని, షెడ్యూల్ ఏరియా రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకొని ఆదివాసి నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా షెడ్యూల్ ఏరియా ప్రాంతాన్ని చిన్నా భిన్నంగా గురిచేసి, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయానికి గురి చేశారని అన్నారు, ఆంధ్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 ని పునరుద్ధరణ కోసం ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ప్రత్యేక చోరవ తీసుకొని చర్చించి పూర్తి న్యాయం చేకూరుస్తానని ఒక ప్రకటన ద్వారా ఆదివాసి నిరుద్యోగులకు భరోసా కల్పించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రాంత షెడ్యూల్ ఏరియా ఆదివాసి నిరుద్యోగులకు ఆంధ్ర ముఖ్యమంత్రి తరహాలో ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ ఆదివాసి నిరుద్యోగులకు జీవో నెంబర్ 3 కొరకు తెలంగాణ ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని కొరకు పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ రిక్రూట్మెంట్ జరిగేది, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్స రాల కాలంలో ఆదివాసి ఉద్యోగ కల్పన ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం గురిచేసిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఆదివాసి ఎమ్మెల్యే లతో ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి జీవో నెంబర్ 3 పై అసెంబ్లీలో తీర్మానం చేసి చట్ట రూపం కల్పించి ఏజెన్సీ డీఎస్సీ ఏర్పాటులో శ్రద్ధ వహించాలన్నారు. లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఆదివాసి ఎమ్మెల్యేలు గూడేలాలకు ఓటు కోసం వస్తే ఆదివాసి నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తారని అన్నారు. అలాగే మే 31 వ తారీఖున జరిగే భద్రాచలం ఐటిడిఏ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసులు పర్శిక బాబురావు, పూనెం విజయ్, సభక రాజు, కృష్ణార్జురావు, ఏడుకొండలుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment