ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య బోధన
– రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన, నాణ్యమైన విద్యా భోదనకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం కాటారం మండలంలో 325 డ్యూయల్ డెస్క్ బెంజీలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 325 డ్యూయల్ డెస్క్ లను 5 గ్రామంలోని పాఠశాలలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులై ఉపాధ్యాయులున్నారని, తల్లిదండ్రులు తప్పనిసరి తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల నమోదును బట్టి ఆయా పాఠశాలలను వసతి గృహాలుగా మార్చుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థులు నమోదు మంచిగా ఉన్న పాఠశాలల విద్యార్థులను ఇతర రాష్ట్రాలకు స్టడీ టూర్ కు పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండల ప్రత్యేక అధికారి డిఆర్డీఓ నరేష్, డీఈఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.