వడదెబ్బతో జాగ్రత్త : డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య

వడదెబ్బతో జాగ్రత్త : డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య

తెలంగాణ జ్యోతి, తాడ్వాయి:తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రణధీర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య పాల్గొని, ఉపాధి కూలీలు వడదెబ్బకు గురికాకుండా అవ గాహన కల్పించాలని తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకె ట్లు కూలీలందరికీ అందజేయా న్నారు. పని చేసే సమయంలో ఎక్కువగా నీళ్లు తాగాలని చెప్పాల న్నారు. రాబోయే ఎలక్షన్ల అనుసరించి ముందస్తు గానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్, డిపిఎమీ సంజీవరావు, శకుం తల, పల్లె దవాఖాన డాక్టర్లు స్వాతి, శ్యామ్, హెచ్ ఈ ఓ వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.