స్కూళ్లలో బతుకమ్మ సంబురాలు – ఆడిపాడిన చిన్నారులు

Written by telangana jyothi

Published on:

స్కూళ్లలో బతుకమ్మ సంబురాలు – ఆడిపాడిన చిన్నారులు

ములుగు, తెలంగాణజ్యోతి: తెలంగాణ పండుగ బతుకమ్మ సంబురాలు జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో వైభవంగా జరిగా యి. ములుగులోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపల్స్ కోటిరెడ్డి, ఆఫీస్ లు, బిట్స్​ ఉన్నత పాఠశాల ప్రైమరీ స్కూల్​ ప్రిన్సిపల్స్​ రజినీకాంత్​, కవిత ల ఆధ్వర్యంలో చిన్నారి బాలిక లు బతుకమ్మలతో తరలివచ్చి ఆడిపాడారు. చూడచక్కని అలంకరణలతో తీసుకువచ్చిన బతుకమ్మలు సాక్షాత్తు అమ్మ వార్లను తలపించాయి. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఉపాధ్యాయినులు సైతం బతుకమ్మ ఆడారు. అనంతరం ములుగు శివారులోని తోపుకుంటలో బతుకమ్మలను నిమజ్జ నం చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సి పల్స్​ మాట్లాడుతూ తెలం గాణ పండుగ అయిన బతుకమ్మ అందరి బతుకు కోరుతుం దని, ప్రజలంతా కుటుంబాలతో సుఖ సంతోషాలతో జీవిం చాలని ఆకాంక్షించారు. అదేవిదంగా సెయింట్ ఆంథోనీస్​, సన్​ రైజర్స్​, దివ్యజ్యోతి, సాధన, వివేకవర్థిని పాఠశాలల్లో సైతం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో కరస్పాండెంట్లు, ప్రిన్సి పల్స్​, ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now